ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు జరుపుకోవాలని,యువత ప్రతిభాపాటవాలను అలవర్చుకొని సన్మార్గంలో సమాజ హితం కోసం పని చేయాలని DCP రాజా మహేంద్ర నాయక్ అన్నారు.జనగామ పట్టణంలోని ఎసిరెడ్డి నగర్ కాలనీలో గణేష్ నిమజ్జన ఉత్సవాలలో పూజ కార్యక్రమంలో డీసీపీ పాల్గొన్నారు.డీసీపి మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల ఉత్సవాలు కులాలకు అతీతంగా మతాల కు అతీతంగా తొమ్మిది రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆటలతో పాటలతో నవరాత్రుల ఉత్సవాలు ప్రజలందరూ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.