మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పెంబి మండలంలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి పెంబి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెంబి మండల కేంద్రానికి చెందిన అందే రమేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగా లేక ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటున్న క్రమంలో కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్సలు అందిస్తుండగా అక్కడి నుండి స్వగ్రామానికి వచ్చి గ్రామ శివారులో గల చెట్టుకు త్రాడుతూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కొడుకు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెంబి ఎస్ఐ హన్మాండ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.