ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు జరగబోయే శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ ఆదేశించారు. కాణిపాకం ఆలయ ఈఓ కార్యాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ చందోలు, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్, ఆలయ ఈఓ పెంచల కిషోర్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.