వాంకిడి మండలంలో గురువారం రాత్రి 11గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కథనం ప్రకారం.. ASF మండలానికి చెందిన కావాల్కర్ శ్రీను ఖమన నుంచి ద్విచక్ర వాహనంపై గుండికి వెళ్తుండగా దుబ్బగూడ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. ప్రమాదంలో శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.