శ్రీ సరస్వతి అలంకరణలో శ్రీ మరగదాంబిక అమ్మవారు నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 9వ రోజు మంగళవారం మరగదాంబికా అమ్మవారు శ్రీ సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో లతా పర్యవేక్షణలో అభిషేక పూజల్లో సత్యవేడు టీడీపీ సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో సత్కరించి ఆశీర్వచనాలు పలికారు.