రైల్వే కోడూరు మండలం వెంకటరెడ్డి పల్లి హరిజనవాడ గ్రామంలో గోకులం షెడ్డు నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్* పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా *అరవ శ్రీధర్ మాట్లాడుతూ* “పశువుల సంరక్షణకు ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. పాలు ఉత్పత్తి పెంచడం, రైతులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం తో పాటు పశు సంరక్షణకు సంబంధించిన ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతో తోడ్పడతాయని” చెప్పారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.