రాయచోటిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ పవన్ కుమార్ నాయుడు (38) శుక్రవారం బ్యాంకు లోపల మరుగుదొడ్డిలో తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.సుమారు ఐదు నెలల క్రితం బ్రాంచ్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, సుండుపల్లి మండలం చప్పిడివారిపల్లికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టిన వారు కేసు నమోదు చేశారు.మృతునికి భార్య అనూష, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త ఆత్మహత్యకు పనిఒత్తిడి కారణమని అనూష ఆరోపించారు.