ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, ఇప్పుడు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వారు కలెక్టర్ పి.రంజిత్ బాషా దృష్టికి తీసుకెళ్లి, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఆధికారులు, నాయకులు తమ గోడు పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.