కర్నూలు నగరంలోని కెసి కెనాల్ లో గుర్తు తెలియని ఆడ శవం కలకలం రేపింది. కర్నూలు నగరంలోని కెసి కెనాల్ లోని గణేష్ నగర వాసులు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కెసి కెనాల్ లో కొట్టుకొని పోతున్న సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. ఆడ శవానికి గాయాలు అయినట్లు పోలీసులు గుర్తించారు. కెసి కెనాల్ లో ప్రమాదవశాత్తు పడిపోయారా లేదా ఎవరైనా హత్య చేసి వదిలేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కర్నూలు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.