ఆదివారం మధ్యాహ్నం ర్యాలంపాడు రిజర్వాయర్ 104 కాలువ రాక కేటిదొడ్డి, ధరూర్ ప్రాంతాల్లోని వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదట కాలువకు నీరు వదలడంతో వరి సాగు చేశామన్నారు. కానీ అర్ధాంతరంగా నీటిని నిలిపివేశారన్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పినా స్పందన లేదన్నారు. దాదాపు 1500పైగా ఎకరాలు బీడు పడ్డాయన్నారు. వెంటనే MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అధికారులు స్పందించి నీరు విడుదల చేయాలని కోరుతున్నారు..