సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య నడిపిన ట్రయల్ రైల్ సక్సెస్ అయింది. దీంతో ఉదయం సికింద్రాబాద్- నిజామాబాద్ మధ్య స్పేషల్ ప్యాసింజర్ రైలు ప్రారంభించారు. గతం కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి దగ్గర రైల్వే లైన్ కొట్టుకుపోవడంతో రైలు రద్దు చేసిన విషయం తెలిసిందే, దీంతో రైల్వే శాఖ ఆధ్వర్యంలో యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి ఈరోజు ట్రాయల్ రైల్ రన్ నిర్వహించడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు మెదక్ జిల్లాలోని మనోహరాబాద్, మాసాయిపేట, వడియారం, అక్కన్నపేట స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు. విశాఖ, సంబల్పూర్ రైళ్లు కూడా నడిచాయన్నారు.