జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు.సరిపడ యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.ఒక్క బస్తా కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.క్యూలైన్లలో బారులు తీరిన యూరియా దొరకడం లేదని,ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా అని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.సకాలంలో రైతులకు సరిపడా యూరియా అందించకుంటే తీవ్ర ఆందోళనలు చేస్తామని రైతలు హెచ్చరించారు.