జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలోని అరబిందో హై స్కూల్ విద్యార్థులు శనివారం రోజున వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. మట్టి వినాయకులను స్వయంగా తయారు చేసి, వాటిని వినాయక వేషధారణలో పూజిస్తూ “మట్టి వినాయకులను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం”, “ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను నిషేదిద్దాం” అంటూ గ్రామంలోని వీధులలో భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రవీందర్ మాట్లాడుతూ, మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా భక్తి, ముక్తి, శక్తి లభిస్తుందని తెలిపారు.