స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు, ట్రాన్స్ జెండర్లకు త్వరలో స్మార్ట్ కార్డులను అందజేయనున్నట్లు శ్రీకాకుళం MLA గొండు శంకర్ అన్నారు. నగరంలోని స్త్రీశక్తి పథకం ప్రచారంలో భాగంగా నగరంలోని సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడలి వరకు మహిళలతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6 పథకాలన్నింటి కంటే 'స్త్రీశక్తి' పథకం వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందారన్నారు.