గుంతకల్ రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫారం-3 పై సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర చెప్పారు. మృతుని వయసు సుమారు 65 సంవత్సరాలు ఉండవచ్చునన్నారు. అనారోగ్య కారణాలవల్ల మృతి చెందాడా లేక ఇతర కారణాల వల్ల మృతి చెందాడు తెలియడం లేదు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాల కొరకు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.