హుజురాబాద్ పట్టణం నడిబొడ్డున్న వేలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న మాంటిస్సోరి స్కూల్ యాజమాన్యం, సుధాకర్ పెట్రోల్ బంక్ యాజమాన్యాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులు సిరిశెట్టి రాజేష్ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నగరంలోని మాంటిస్సోరి స్కూల్, సుధాకర్ పెట్రోల్ బంక్‌లు పక్కపక్కనే ఉన్నాయని ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే స్కూల్‌లో చదువుతున్న వేలాది మంది పిల్లల ప్రాణాలకు అపాయముందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.