యాదాద్రి భువనగిరి జిల్లా: ఈనెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి మూసివేనున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం ఈ సమయంలో నిత్య కైకర్యాలు నిర్వహించి ఆలయ తలుపులు మూసివేస్తారని తెలిపారు. మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి సంప్రోక్షణ తర్వాత నిత్య కైకర్యాలు యధావిధిగా కొనసాగిస్తారని ఈవో వెంకట్రావు తెలిపారు .ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.