కాగజ్ నగర్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లోగోలను, పేపర్ ను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు పై మాట్లాడిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విషం చిమ్ముతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రచారాలు చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏబీఎన్ ఛానల్ సిఎండి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆంధ్రకు తరిమి కొడతామని హెచ్చరించారు,