నిరుపేదలకు ఆకలి తీర్చేందుకే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో రూ. 61 లక్షలతో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 30x 30 విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.