జంగారెడ్డిగూడెం డివిజన పరిధిలో అధ్వానంగా మారిన రహదారులను తక్షణమే అభివృద్ధి చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం ధర్మా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్లోని పలు ప్రధాన రహదారులు కూడా అద్వానంగా ఉండడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున పాడైపోయిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేసారు.