Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని పిఎసిఎస్ గోడౌన్లను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు డిఎస్పి సంపత్ రావు తెలిపారు. రేగొండలో ఎస్సై రాజ్ కుమార్, చిట్యాల లో ఎస్ ఐ శ్రావణ్ కుమార్, గణపురంలో సిఐ కరుణాకర్ రావు, ఎస్సై అశోక్ భూపాలపల్లిలో సిఐ నరేష్ గౌడ్, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి పి ఏ ఎస్ ఎస్ నిర్వాకులతో మాట్లాడినట్లు డిఎస్పీ సంపత్ రావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన ప్రకారం రైతులకు యూరియా అందించాలని, యూరియా కృత్రిమ సృష్టిస్తే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు డిఎస్పి సంపత్ రావు.