పరిశ్రమలు, యూనిట్ల స్థాపనలో ఔత్సాహికులను ప్రోత్సహించే అంశంలో వెనుకాడేదే లేదనీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈపై అవగాహనలో భాగంగా ఏలూరులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు సంబంధిత శాఖల అధికారులు, మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు, యూనిట్ల స్థాపనపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమైన ప్రాధమిక అవగాహనను కల్పించేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. అప్పుడే వారి ఆలోచనలు విజయవంతంగా ఆవిష్కృతమవుతాయని సూచించారు.