గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో సోమవారం ఫ్రీ బస్సు ఎఫెక్ట్ తో జనాలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6 నుంచి బస్సులు కోసం బస్టాండులో వేచి ఉన్నారు. గంటలకు నిరీక్షించి నీరసించి పోయారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఫ్రీ బస్సు కారణంగానే బస్సులు దొరకడం లేదని ప్రయాణికులు వాపోయారు. ఆర్టీసీ బస్టాండ్ మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. బస్సు వచ్చిందంటే చాలు పరుగులు తీస్తున్నారు. బస్సులు సంఖ్యను పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.