శుక్రవారం రోజున పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది తొమ్మిది రోజులపాటు తమ గృహాల్లో పూజలు నిర్వహించుకున్న భక్తులు చివరిసారిగా వీడ్కోలు పలుకుతూ తమ గణనాథులను ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తూ వీడ్కోలు పలికారు వినాయక నిమజ్జనానికి మినీ ట్యాంక్ బండ్ వద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు మున్సిపల్ శాఖ అధికారులు రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజాము వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు