బీసీ రిజర్వేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీ పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుగుణ అన్నారు. సోమవారం ASF డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ నివాసంలో ఆమె మాట్లాడారు..బీసీలు రాజకియంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. BRS.BJPకి బీసీ రిజర్వేషన్ పై చిత్తశుద్ధి లేదని చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్. రాష్ట్రపతి వద్ద పంపితే కానీసం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.