నల్లగొండ జిల్లా: వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను మంగళవారం ఆదేశించారు. మంగళవారం ఆమె నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని వల్లభారత్ చెరువులో నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈనెల ఐదున గణేష్ నిమజ్జనాన్ని జరగనున్న దృష్ట్యా వల్లభారావు చెరువుతోపాటు ఆలియా సమీపంలోని 14వ మైలురాయి వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ల ఏర్పాటు గజ ఈతగాలను సిద్ధంగా ఉంచాలని అవసరమైన వెలుతురు ఉండేలా లైటింగ్ తాగునీరు అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు.