ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు శుక్రవారం రాత్రి నుంచి కనిపించని విషయం తెలిసిందే. మధ్యాహ్నపువారి గూడెం కాలువలో ఆదివారం ఉదయం ఆయన బైక్ గుర్తించారు. ఈక్రమంలో గజ ఈతగాళ్లతో వాగు మొత్తం గాలించారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గుర్తించి బయటకు తీశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.