ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఎరువుల కొరతలేదని నిర్ధారించారు. ఎవరైనా ఎరువుల దుకాణదారులు కృత్రిమ కొరతను సృష్టించి రైతులకు ఇబ్బందులను గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎరువుల దుకాణదారులను సురేష్ హెచ్చరించారు. అలానే రికార్డులను పరిశీలించి ఎరువులు రైతుల కోసం నిరంతరం అందుబాటులో ఉంచాలని సిఐ సురేష్ తెలిపారు.