గుర్రంకొండ షంషీర్ షా వలి దర్గా ముతవల్లిగా రెన్యువల్ చేయడానికి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ లంచం అడిగాడని దర్గా చైర్మన్ కాలేషా మస్తాన్ శుక్రవారం ఆరోపించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం గుర్రంకొండ పట్టణం గాలివీడు మార్గం నందు గల పురాతన షంషీర్ షా వలి దర్గాను ఎన్నో తరాలుగా ప్రస్తుత దర్గా చైర్మన్ కాలేషా మస్తాన్ వలి వారి వంశస్థులు బాగోగులు చూస్తున్నారు. ఈ దర్గాకు భక్తులు వందలాది మంది వచ్చి ప్రార్థనలు చేసి వెళ్తుంటారు.ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఇక్కడ ఒక పండగ వాతావరణం ఉంటుంది.