Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 24, 2025
గణపురం మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యేకు వైద్యాధికారిణి డాక్టర్ అనూష స్వాగతం పలికారు. ఎమ్మెల్యే హాస్పిటల్ లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన సేవలు అందించడానికి ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలను, మాత, శిశు సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన పెంచుతూ, ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను పెంచాలని వైద్యాధికారిణిని ఎమ్మెల్యే ఆదేశించారు. ఆసుపత్రికి ప్రతిరోజు రోగులు ఎంతమంది