నిన్న అనగా 25 వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో నగర 13 వ వార్డులో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న తన పట్ల స్థానిక జనసేన పార్టీ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించాడని దేవరవాయి పద్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు ఆరోపించింది. ఇదే అంశంపై శుక్రవారం మధ్యాహ్నం స్థానిక లాలాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంతకుముందు పోలీసులు పారిశుద్ధ్య కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరించారు. మీరు ఇంతమంది రాకూడదు అని వెనక్కు పంపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కార్మికురాలు ఫిర్యాదును స్వీకరించారు.