సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే మందుల సామేలు క్యాంపు కార్యాలయంలో బుధవారం తిరుమలగిరి నాగారం జాజిరెడ్డిగూడెం మండలాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ముందుల సామేలు అందజేశారు. ఈ సందర్భంగా 60 మంది లబ్ధిదారులకు 24 లక్షల 32,000 విలువగల సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశామని ,ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సభ్యులు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.