తిరువూరు మండలం వామకుంట్లలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామ శివారులో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు రామకృష్ణ (36) చెరువులో పడి మృతి చెందాడు. అతడిని కాపాడబోయిన వెంకటనారాయణ అనే వ్యక్తి గాయపడ్డారు. వెంకటనారాయణను చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం 10:00 సమయంలో తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.