శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పాత బస్టాండ్ ఆవరణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భూమి పూజ చేశారు. శుక్రవారం ఉదయం పెనుకొండను రెండో రాజధానిగా ఎంచుకొని పాలించారని, మహారాజు కట్టించిన 365 దేవాలయాలు ఆయన ఘనతకు నిదర్శనమన్నారు. త్వరలోనే సొంత నిధులతో విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని మంత్రి తెలిపారు.