రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారిక ప్రభుత్వమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీరంగాపురం జడ్పిటిసి రాజేంద్ర ప్రసాద్ యాదవ్ అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, 2500 మహాలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తామని ప్రకటించడంతో గురువారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి చిత్రపటం తో పాటు మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాముల యాదవ్ తో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు.