బెజ్జూరు మండలంలోని సలగుపల్లి గ్రామంలో పొలాల అమావాస్య పండుగ సందర్భంగా ఆదివారం మట్టి ఎడ్లను తయారుచేసి వాగు ఒడ్డున గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. మట్టి ఎడ్లకు పూజల అనంతరం సమీపంలోని వాగులో నిమజ్జనం చేశారు. ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా మహర్ కులస్తులందరం ప్రత్యేక పూజలు చేసి పొలాల అమావాస్య పండుగను జరుపుకోవడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు,