పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. జైత్ర బిజ్ సాల్యుషన్స్ ఆధ్వరంలో 5 వేల ఉచిత మట్టి వినాయక ప్రతిమలను శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు భీమవరం భగవాన్ ప్లాజా వద్ద వారు పంపిణీ చేశారు. గత 13 ఏళ్లుగా 5 వేల మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. మట్టి విగ్రహాలతోనే పూజించాలన్నారు.