సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు తో కలిసి గ్రంధాలయాల అభివృద్ధి పై గ్రంథాలయ అధికారులతో సమీక్షించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలని సూచించారు. శాఖ మరువైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు .