కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. సోమవారం సోమందేపల్లి మం. బ్రాహ్మణపల్లిలో మంత్రి మాట్లాడారు. వైసీపీ తమ ఉనికి చాటుకోవడానికి రప్ప రప్ప అంటూ డైలాగులు చెప్తున్నారన్నారు. ధర్మవరంలో చెయ్యి ఉన్న ఓ వ్యక్తి చేయలేకుండా వీడియో తీసి తన పెన్షన్ పీకేశారని కూటమి ప్రభుత్వంపై అవాస్తవాలు పోస్ట్ చేశారన్నారు. అతను వికలాంగుడు కాదని పోలీసులు గుర్తించారన్నారు.