సెప్టెంబర్ 1 CPS విద్రోహ దినంను పురస్కరించుకొని ASF కలెక్టరేట్ ఎదుట TGE JAC ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో సోమవారం మధ్యాహ్నం నిరసన కార్యక్రమం చేపట్టారు. CPS ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని TGE JAC జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ డిమాండ్ చేశారు. పెన్షన్ బిక్ష కాదని, ఉద్యోగుల హక్కని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయ ఉద్యోగులు పాల్గొన్నారు.