రౌడీ షీటర్ శ్రీకాంత్,లేడీ డాన్ నిడిగుంట అరుణ కేసులకు సంబంధించి ప్రత్యేక అధికారిగా పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా పేరున్న PHD రామకృష్ణ నియామకం కానున్నారు. అరుణ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రానికి లేడీ డాన్ నిడిగుంట అరుణ మూడు రోజులు పోలీసు కస్టడీ ముగిసింది. ఒంగోలు తో పాటు నెల్లూరు జిల్లాలో పలు హత్యలు జరిగాయి. ఈ హత్యలకు అరుణ గ్యాంగ్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.