ఫిట్నెస్ పోలీసు ప్రధాన కర్తవ్యమని నగరి డీఎస్పీ అజీజ్ శనివారం అన్నారు. నగరిలోని స్థానిక కేవీకే మైదానంలో డివిజన్ పరిధిలోని పోలీసులకు బాడీ ఫిట్‌నెస్‌పై శిక్షణ అందించారు. వ్యాయామం చేసే పద్దతులు, తీసుకోవలసిన పౌష్ఠికాహారాలు, సెల్యూట్ చేసే విధానాలపై ప్రత్యేక శిక్షణ అందించారు. ప్రత్యక్షంగా వ్యాయామం చేస్తూ పోలీసులు అందరిచేత చేయించారు.