ఏలూరులోని తూర్పు, పడమట లాకులు, దెందులూరు సమీపంలో వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలను ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు పరిశీలించారు. నిమజ్జనం చేసే ప్రాంతాలలో ఈతరాని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోనికి దిగుకూడదన్నారు. తల్లిదండ్రులు చిన్న పిల్లలను విగ్రహ ఊరేగింపులు, నిమజ్జనం కార్యక్రమంలో ఒంటరిగా పంపొద్దని సూచించారు.