మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వికారాబాద్ జిల్లాలో ప్రసిద్ధ శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి భక్తులు అభిషేకాలు చేసి, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సుప్రభాత సేవ, గణపతిపూజ, శివాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు.