అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలం ముకుందాపురంలో చీనీ చెట్లకు మందు పిచికారి చేసిన రైతుకు అస్వస్థత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓబులేసు తన తోటలో చీనీ చెట్లకు మందు పిచికారి చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అతనికి ఇంటికి చేరుకున్న అనంతరం కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.