Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం మండలం బందార్లపల్లి క్వారీలో గొడవ.. పలువురికి గాయాలు

Gangadhara Nellore, Chittoor | Sep 7, 2025
వెదురుకుప్పం మండలంలో బందార్లపల్లి గ్రానైట్ క్వారీలో ఆదివారం గొడవ చోటు చేసుకుంది. అనుమతులు లేకుండా క్వారీలు నడుపుతున్నారంటూ స్థానికులు అడ్డుకోగా క్వారీ యజమానులు వారిపై దాడులకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలు కాగా పలు వాహనాలు సైతం ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us