కర్నూలు నగరంలో భారీ వర్షం కురుస్తుంది. నగరంలో గురువారం తెల్లవారుజామున నుండి భారీ వర్షం కురుస్తుంది. ఉక్క పోత తీవ్రతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో కర్నూలు నగర ప్రజలకు ఉక్కిరిబిక్కిరిని చేసింది ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదయ్యాయి అయితే గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా వర్షం కొరవడంతో నగరవాసులకు ఉష్ణోగ్రత నుండి ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కర్నూలు నగరంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు