యాదాద్రి భువనగిరి జిల్లాలోని నెలకొన్న యూరియా కొరతను తక్షణమే నివారించి రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి సోమవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోత్కూర్ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని యూరియా కొరతను తక్షణమే నివారించి రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు తగిన ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు.