మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ వద్ద ఏపిఐఐసి మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మెట్టుగోవిందరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కణేకల్లు, బొమ్మనహాల్, డి.హిరేహాల్ మండల కేంద్రాల్లోనూ ఆ పార్టీ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. జోహార్ వైఎస్సార్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు.