కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి గురువారం సాయంత్రం పర్యటించారు. గ్రామంలోని కోపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా వివరాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రైతులకు సరిపడినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు.